Nothing found
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.

నాకు సెక్స్ బొమ్మలు, కండోమ్‌లు, ల్యూబ్లు లేవు. బదులుగా నేను ఏమి ఉపయోగించగలను?

సెక్స్ బొమ్మలకు, లూబ్స్లకు లేదా అవరోధ పద్ధతులకు ప్రత్యామ్నాయాన్ని కనుగొనడానికి మీకు చాలా కారణాలు ఉన్నాయి. మీకు ఈ వస్తువులు సులువుగా లభ్యం కాకపోవచ్చు. మీరు మీ కుటుంబంతో పాటు నివసించి ఉండవచ్చు, అట్టి సెక్స్ బొమ్మలు మీరు కలిగి ఉన్నారని ఇతరులకు తెలిస్తే మీకు ఆపదొ ప్రమాదమో కావొచ్చు. లేదా మీరు ఒక ట్రాన్స్ వ్యక్తి అయ్యి ఉండవచ్చు లేదా మీ శరీరానికి లేక మీ విభిన్న విస్పష్టమైన లైంగిక శృంగార అవసారాలకు సరిపోయే అవరోధ పద్ధతులను కనుగొనలేకపోవచ్చు.

మీ పరిస్థితి ఏమైనప్పటికీ, వాటిని ఉద్దేశించిన ప్రయోజనం కోసం వస్తువులను ఉపయోగించడం ఎల్లప్పుడూ మంచిది - ఉత్తమ పురుషాoగ ఉంగరము (కాక్ రింగ్) ఒక పురుషాoగ ఉంగరముగా (కాక్ రింగ్‌గా) తయారవుతుంది. అత్యంత ప్రభావవంతమైన అవరోధ పద్ధతులు నిజమైన కండోమ్‌లు మరియు డెంటల్ డామ్లు (దంత ఆనకట్టలు). సరిగ్గా ఉపయోగించినట్లయితే సురక్షితంగా ఉండే ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.

శృంగార (సెక్స్) బొమ్మల ప్రత్యామ్నాయాలు

ఇంట్లో శృంగార (సెక్స్) బొమ్మలు దొరికే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీరు డిల్డో, పురుషాoగ ఉంగరము (కాక్ రింగ్) లేదా ఇంపాక్ట్ ప్లే కోసం పదార్ధాలు చూస్తున్నారా? ఉద్దేశించిన ప్రయోజనం పరిధి వెలుపల వస్తువులను మీరు ఉపయోగిస్తున్నప్పుడు హాని తగ్గించే మార్గాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం మరియు ముఖ్యం.

మీరు గృహ వస్తువులను డిల్డోస్‌గా ఉపయోగిస్తుంటే, ఇన్‌ఫెక్షన్‌ను నివారించడానికి ఈ వస్తువులను కండోమ్‌తో కప్పుకోండి. హెయిర్ బ్రష్ హ్యాండిల్స్ మరియు కూరగాయలు తరచు ఉపయోగింపబడేవి మరియు అందుబాటులో ఉన్నవి. కూరగాయలకు పూర్తిగా మృదువైన ఉపరితలాలు లేవు, కాబట్టి అవి కండమ్ను చిన్నగా చింపగలవు, ఇవి బ్యాక్టీరియా సంక్రమణకు దారితీస్తాయి. మీరు అనల్‌గా (మలద్వారము నందు) పంపించే ఏదైనా డిల్డో మీ లోపలికి చిక్కుకోకుండా ఉండటానికి ఒక విస్తృత స్థావరం (బేస్) కలిగి ఉండాలి.

దంత విధ్యుత్ (ఎలక్ట్రిక్ టూత్) బ్రష్ హ్యాండిల్ లేదా మీ చరవాణి (ఫోన్) వంటి కంపనము కలిగించు సామగ్రిగా (వైబ్రేటర్లుగా) మీరు ఉపయోగిస్తున్న వస్తువులు, అవి జలనిరోధితంగా (వాటర్ ప్రూఫ్గా) ఉన్నాయో లేదో తెలుసుకోవడం ముఖ్యం. ఈ పరికరాలతో ఎల్లప్పుడూ కాండోమ్ను ఉపయోగించండి మరియు మీ శరీరానికి వెలుపల ఉన్న ప్రాంతాలను ఉత్తేజపరిచేందుకు మాత్రమే వాటిని ఉపయోగించండి.

పురుషాoగ ఉంగరమును (కాక్ రింగును) మీరు ఇప్పటికే కలిగి ఉన్న సామగ్రి నుండి కూడా రూపొందించవచ్చు. పురుషాoగ ఉంగరముగా (కాక్ రింగ్‌గా) ఉపయోగించడానికి మీరు చొప్పించే కాండోమ్ నుండి ప్లాస్టిక్ ఉంగరమును (రింగ్‌ను) తీయవచ్చు. పురుషాoగ ఉంగరములు (కాక్ రింగులు) స్వల్ప కాలానికి మాత్రమే ధరించాలి మరియు మీ పురుషాoగము గట్టిగా నిటారుగా ఉన్నప్పటికీ సులభంగా తీయగల సౌకర్యవంతమైన పదార్థంతో తయారు చేసి ఉండాలి. మీకు అసౌకర్యం అనిపించైనా లేదా గాయాలు కావడం గమనించినట్లయితే, వెంటనే పురుషాoగ ఉంగరమును (కాక్ రింగ్ను) తీయండి. మీరు దానిని తొలగించలేకపోతే, వెంటనే వైద్య సహాయం తీసుకోండి.

దిండ్లు మరియు సాక్స్ వంటి వస్తువులను హస్త ప్రయోగం (మాస్టరబేషన్) స్లీవ్లుగా, బట్టల పిన్నులను చనుమొన బిగింపులుగా (నిప్ప్ల్ క్లాంప్లుగా) ఉపయోగించవచ్చు మరియు బెల్టులు, గరిటెలాంటి లేదా చెక్క స్పూన్లు బంధం మరియు ప్రభావవంతమైన లైంగిక ఆటల (ఇంపాక్ట్ ప్లే) కోసం ఉపయోగించవచ్చు. ఈ శృంగార (సెక్స్) బొమ్మల ప్రత్యామ్నాయాల వలే, సాధ్యమయ్యే నష్టాలు ప్రమాదాల గురించి ముందే తెలుసుకోండి మరియు వాటిని నివారించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోండి.

శృంగార బొమ్మ (సెక్స్ టాయ్) ప్రత్యామ్నాయాల కోసం అతిపెద్ద నీతులు: పదునైన లేదా విద్యుత్ సమ్మoదితమైన దేనినీ మీ లోపల దూర్చవద్దు; అన్ని వస్తువులను కాండోమ్తో కప్పండి; మరియు మీ లోపల సులభంగా విచ్ఛిన్నమయ్యే లేక విరిగిపోయే వస్తువులను ఉపయోగించవద్దు.

ల్యూబ్ ప్రత్యామ్నాయాలు

లైంగిక సంభోగం మరియు శృంగారంలో ల్యూబ్ ఒక ముఖ్యమైన భాగం, ఇది సౌకర్యాన్ని పెంచుతుంది మరియు లైంగిక సంభోగం వల్ల ప్రసారింపబడు సుఖవ్యాధి/ఇన్ఫెక్షన్ల (STIల) ప్రసార ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మీ వద్ద ల్యూబ్‌ లేకపోతే, ప్రత్యామ్నాయాలు పుష్కలంగా ఉన్నాయి. ల్యూబ్ స్థానంలో లాలాజలం అనగా ఉమ్ము మరియు విభిన్న రోజువారీ వస్తువులను ఉపయోగించవచ్చు - రిఫైనరీ౨౯ వారి వద్ద ఇక్కడ ల్యూబ్ ప్రత్యామ్నాయాల మంచి జాబితా ఉంది.

మీరు ఎస్టీఐలు (STIలు) లేదా గర్భధారణను నివారించడానికి కాండోమ్‌లను ఉపయోగిస్తుంటే, మీ ల్యూబ్ ప్రత్యామ్న్యాయాలలో నూనె ఉండకూడదు. నూనె కాండోమ్‌లను విచ్ఛిన్నం చేస్తుంది మరియు వాటిని పనికిరాకుండా చేస్తుంది.

లూబ్ మరియు ల్యూబ్ ప్రత్యామ్నాయాల గురించి మరింత సమాచారం కోసం, లైంగిక ఆనంద కేంద్రాన్ని (సెంటర్ ఫర్ సెక్షుఅల్ హెల్త్) మరియు ఆరోగ్య మార్గదర్శిని (హెల్త్ గైడ్ని) ఇక్కడ చూడండి.

అవరోధ పద్ధతి ప్రత్యామ్నాయాలు

కాండోమ్‌లు లేదా దంత ఆనకట్టలు (డెంటల్ డామ్లు) వంటి అవరోధ పద్ధతులకు ప్రత్యామ్నాయాలను కనుగొనడం కష్టం. మీకు కండోమ్ లేదా దంత ఆనకట్ట (డెంటల్ డామ్) లేనప్పుడు మీరే తయారు చేసుకోవడానికి ప్రయత్నించగలిగిన అవరోధ పద్ధతులు చాలా తక్కువ.

ప్లాస్టిక్ సంచులు మరియు ప్లాస్టిక్ ర్యాప్ వంటి వాటిని ఏవైనా చొచ్చుకుపోయే శృంగారానికివి లైంగిక సంభోగానికి కండోమ్‌లుగా ఉపయోగించరాదు. లైంగిక ద్రవాలను లోపల ఉంచడం కండోమ్‌ల ధ్యేయం. ఈ వస్తువుల నుండి రోల్-ఆన్ కాండోమ్ సృష్టించడానికి ప్రయత్నించడం లైంగింక ప్రసార సుఖవ్యాధులను/ఇన్ఫెక్షన్లు (ఎస్టీఐలు/STIలు) లేదా గర్భధారణను నివారించడానికి సమర్థవంతమైన ఎంపిక కాదు.

అయినప్పటికీ, అస్య మైథునము (ఓరల్ సెక్స్) కోసం మలద్వారమును, పాయువును, గుదమును, అపానమును లేదా యోనిని కప్పడానికి ఉపయోగించే దం�� ఆనకట్టను (డెంటల్ డామ్ను) తయారు చేయడానికి మీరు రోల్-ఆన్ కాండోమ్, లేటెక్స్ / లేటెక్స్ లేని చేతి తొడుగులు (గ్లోవ్స్) లేదా మైక్రోవేవ్ చేయలేని ప్లాస్టిక్ ర్యాప్‌ను స్వీకరించవచ్చు. ప్లాస్టిక్ ర్యాప్ ఉపయోగించడం వల్ల అది ఇర్రుక్కునే ప్రమాదం ఉందని మాత్రము తెలుసుకోండి సుమా.

మన అన్ని ప్రత్యామ్నాయాల వలే, ఈ వస్తువులు కాండోమ్‌లుగా ఉపయోగించటానికి ఉద్దేశించినవి కావు మరియు లైంగిక ప్రసార సుఖవ్యాధులను/ఇన్ఫెక్షన్లు (ఎస్టీఐలు/STIలు) లేదా గర్భం రాకుండా నిరోధించడానికి వీటిపైనా ఆధారపడరాదు.

శృంగార బొమ్మలు (సెక్స్ టాయ్స్), ల్యూబ్ లేదా అవరోధ పద్ధతులకు ప్రత్యామ్నాయాల గురించి మీకు ప్రశ్నలు ఉంటే, మీరు ఇక్కడ ప్రణాళికాబద్ధమైన పేరెంట్‌హుడ్ ఆరోగ్య అధ్యాపకులతో (ప్లాన్డ్ ప్రెంత్తోడ్ హెల్త్ ఎడ్యుకేటర్లతో) చాట్ చేయవచ్చు.

Recently viewed articles

Related articles